వినియోగదారులకు శుభవార్త: దిగిరానున్న వంట గ్యాస్‌ ధర

29 Nov, 2022 15:19 IST|Sakshi

సాక్షి, ముంబై:  మరికొన్ని రోజుట్లో వంట గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త అందనుంది. దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్యాస్ ధరపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వెలుడుతున్నాయి. దీనికి తోడు తగ్గుతున్న చమురు ధరలు ఈ అంచనాలకు ఊతమిస్తున్నాయి. (షాకింగ్‌: 5.4 మిలియన్ల ట్విటర్‌ యూజర్ల డేటా లీక్! మస్క్‌ స్పందన ఏంటి?)

వంట గ్యాస్‌ను చౌకగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా సీఎన్‌జీ, ఎల్‌పీసీ గ్యాస్ రెండింటి ధరలను తగ్గించే అవకాశం ఉందని అంచనా. గత కొంత కాలంగా  కోవిడ్‌ మహమ్మారి, ఇటీవలి భౌగోళిక రాజకీయ సంక్షోభం గ్యాస్ ధర పెరగడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో  గ్యాస్ ధరల నియంత్రణకు  సెప్టెంబరులో ఏర్పాటైన కమిటీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. దీని కింద ప్రభుత్వ రంగ సంస్థల పాత సెక్టార్ నుంచి వచ్చే సహజ వాయువు ధర పరిమితిని నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది. ఇది గ్యాస్ కోసం సిఫార్సు చేసే అవకాశం ఉంది.  ఈ మేరకు ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు కిరీట్ ఎస్ పరేఖ్ నేతృత్వంలోని కమిటీ  నవంబర్ 29న ప్యానెల్ సభ్యులు తమ సిఫార్సులను సమర్పించనున్నారు.  ఈ అంచనాలు నిజమైతే సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది. (ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ)

కాగా ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం తెలిసిన సంగతే.  గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు