ట్విట్టర్‌ కొనుగోలు..ఎలన్‌ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ

20 Jul, 2022 09:37 IST|Sakshi

టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ ఎదురు దెబ్బ తగిలింది. మస్క్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదైన కేసును డెలావేర్ కోర్టు ఫాస్ట్‌ ట్రాక్ట్‌ కేసుగా కోర్ట్‌ పరిగణలోకి తీసుకుందని, ఈ అక్టోబర్‌ నెలలో కేసును విచారిస్తామని కోర్టు చీఫ్ జడ్జ్‌ కాథలీన్ సెయింట్ జే. మెక్‌కార్మిక్ తీర్పిచ్చారు.

ఎలన్‌ మస్క్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫేక్‌ అకౌంట్‌ల విషయంలో సోషల్‌ మీడియా దిగ్గజం స్పషత ఇవ్వలేదని, కాబట్టి ఈ డీల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ట్విట్టర్‌ యాజమాన్యం.. మస్క్‌కు వ్యతిరేకంగా కోర్ట్‌ను ఆశ్రయించింది. విచారణ వేగవంతంగా పూర్తి చేసి న్యాయం చేయాలని కోరింది. 

అదే సమయంలో విచారణ పేరుతో ట్విట్టర్‌ తరుపు న్యాయవాదులు వారికి ఏమాత్రం సంబంధంలేని ఆర్ధిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని మస్క్‌ మండిపడ్డారు. కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు వారాల పాటు విచారణ జరపాలని ఎలాన్‌ మస్క్‌.. కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. మస్క్‌ విజ్ఞప్తిపై ఆయన (మస్క్‌ను ఉద్దేశిస్తూ) తీసుకునే అర్ధరహితమైన నిర్ణయాల వల్ల తమ (ట్విట్టర్‌) బిజినెస్‌ నష్టపోతుందని, ట్విట్టర్‌కు నష్టం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్‌ తరుపు న్యాయవాది అటార్నీ సోవియట్‌ వాదించింది. అందుకే విచారణ వేగవంతంగా పూర్తి చేసి న్యాయం చేయాలని కోరింది.

మాకు ఆ ఉద్దేశం లేదు
వర్చువల్‌గా జరిగిన కోర్టు విచారణలో సోవియట్‌ వాదనకు ఏకీభవించని మస్క్‌ తరుపు న్యాయ వాది న్యాయవాది ఆండ్రూ రోస్మాన్ మాట్లాడుతూ.." ట్విట్టర్‌కు నష్టం చేయాలనే ఆలోచన నా (మస్క్‌) క్లయింట్‌కు లేదు. ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు సుముఖంగానే ఉన్నారు. కానీ ఫేక్‌ అకౌంట్‌ల విషయంలో స్పష్టత లేదు. పైగా సంస్థలో  మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల్ని ఎక్కువ మందిని విధుల నుంచి తొలగించింది. మస్క్‌తో కుదుర్చుకున్న ఒప్పొందాన్ని ట్విట్టర్‌ అతిక్రమించిందని అన్నారు. ట్విట్టర్‌లో రెండవ అతిపెద్ద షేర్‌ హోల్డర్‌ మస్క్‌ సంస్థకు నష్టం చేయాలని ఎలా అనుకుంటారని కోర్టుకు విన్నవించుకున్నారు. 

నష్టం ఎక్కువే   
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారణ ప్రారంభించడం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ట్విట్టర్‌ తరుపు న్యాయవాది అటార్నీ సోవియట్‌ అన్నారు.ఉద్యోగుల్ని నిలుపుకోవడం నుంచి సప్లయర్ల నుంచి కస్టమర్లతో సంబంధాల వరకు ఇలా ప్రతి అంశంలో సంస్థ తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్‌ ఆధారపడుతుందని, కాబట్టి  సెప్టెంబర్‌లో విచారణ, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 
   
మస్క్‌కు ఎదురు దెబ్బ 
ఎలాన్‌ మస్క్‌ , ట్విట్టర్‌ తరుపు న్యాయవాదుల వాదనల్ని విన్న డెలావేర్ కోర్టు చీఫ్ జడ్జ్‌ కాథలీన్ సెయింట్ జే. మెక్‌కార్మిక్ తీర్పు వెలువరించారు. ఫిబ్రవరిలో 11రోజుల పాటు విచారణ చేపట్టాలన్న మస్క్‌ విజ్ఞప్తిని తిరస్కరించారు. అక్టోబర్‌లో 5రోజుల పాటు విచారణ చేపడతామని అన్నారు. దీంతో కోర్టులో మస్క్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

మరిన్ని వార్తలు