షాకింగ్‌: 100కు పైగా డేంజరస్‌ యాప్స్‌,  వెంటనే డిలీట్‌ చేయకపోతే 

5 Jun, 2023 13:54 IST|Sakshi

ఆండ్రాయిడ్‌ యూజర్లకు హెచ్చరిక

40 కోట్లకు  పైగా డౌన్‌ లోడ్స్‌ 

యాప్స్‌కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్‌న్యూస్‌. స్మార్ట్ ఫోన్లను హ్యాక్‌ చేసి భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా  డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై  తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.

గూగుల్ ప్లే స్టోర్‌ లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదైనాయి, అంటే దాదాపు 40  కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే.  రోజువారీ రివార్డ్‌లు, మినీ గేమ్‌లను  ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్‌కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్‌ యాప్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు.  భవిష్యత్తులో ఇలాంటి యాప్‌లను గుర్తించి,  డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.  (బుగట్టి రెసిడెన్షియల్‌ టవర్‌...నెక్ట్స్‌ లెవల్‌: దిమ్మదిరిగే ఫోటోలు)

ప్రభావితమైన యాప్‌లు ఇవే
నాయిజ్:  వీడియో ఎడిటర్ విత్‌ మ్యూజిక్‌
జాప్యా:  ఫైల్ బదిలీ,  షేర్‌
వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్
ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్
బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్
క్రేజీ డ్రాప్
క్యాష్‌జైన్ – క్యాష్‌ రివార్డ్‌
ఫిజ్జో నావల్‌ – ఆఫ్‌లైన్‌ రీడింగ్‌ 
క్యాష్ ఈఎం: రివార్డ్స్‌ 
టిక్: వాట్‌ టు ఎర్న్‌
మాల్వేర్ సోకిన యాప్‌లను ఎలా గుర్తించాలి
యాప్ అనుమతులను  చెక్‌ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్‌వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి.
నకిలీ ఆఫర్‌లు లేదా రివ్యూస్‌లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్‌ అభిప్రాయానికి, సపోర్ట్‌కు స్పందించే డెవలపర్‌ల విశ్వసనీయతను  గమనించాలి.
ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్‌స్టాల్‌ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది  యాప్‌ను ఇన్‌స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి.  డౌన్‌లోడ్లకు మించి రివ్యూలుంటే  అనుమానించాల్సిందే.
యాప్ డెవలపర్‌ని  ఇతర సోషల్‌మీడియా హాండిల్స్‌, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌)
స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా  గమనించాలి.
 పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్‌ల జోలికి అసలు వెళ్ల వద్దు. 
ముఖ్యంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే,  ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది.

మరిన్ని బిజినెస్‌ వార్తలు, అప్‌డేట్స్‌  కోసం చదవండి:సాక్షిబిజినెస్‌ 

మరిన్ని వార్తలు