ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఉబర్ సంస్థ ఆగ్రహం?

25 Feb, 2023 14:13 IST|Sakshi

ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేట‌ర్ ఉబర్ టెక్నాల‌జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పొల్యూషన్‌ను తగ్గించేలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీ న‌గ‌ర ప‌రిధిలో ఎల‌క్ట్రిక్ వాహనాలను మాత్రమే ట్యాక్సీలుగా అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని క్యాబ్‌ సర్వీస్‌ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ తరుణంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై క్యాబ్స్ అగ్రిగేట‌ర్ ఉబర్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవ‌లం ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌ను మాత్ర‌మే ట్యాక్సీలుగా వాడాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తే ల‌క్ష మందికి పైగా డ్రైవ‌ర్ల  జీవనోపాధి దెబ్బ తింటుంద‌ని పేర్కొంది. అంతేకాదు ల‌క్ష‌లాది మంది ర‌వాణా అవ‌సరాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

ఈవీను మాత్ర‌మే ట్యాక్సీలు వాడాలన్న ఢిల్లీ సర్కార్‌ అమలు చేయడం అసాధ్యమని, కావాలంటే దీనిపై సంబంధిత పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ స‌ర్కార్‌ను కోరింది. మరోవైపు ఉబర్‌ సంస్థ 2040 నాటికి క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహ‌నాల‌న్నీ క‌ర్భ‌న ర‌హితంగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. వ‌చ్చే మూడేండ్ల‌లో 25 వేల ఈవీల‌ను క్యాబ్ స‌ర్వీసులుగా వాడ‌నున్న‌ట్లు ఉబ‌ర్ ప్ర‌క‌టించింది.

మరిన్ని వార్తలు