ఓలా, ఉబర్, రాపిడోలకు భారీ షాక్‌, ఉల్లంఘిస్తే​​ కఠిన చర్యలు

20 Feb, 2023 19:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బైక్ సర్వీస్ అగ్రిగేటర్‌లకు దేశ రాజధానిలో భారీ షాక్‌ తగిలింది. ఓలా, ఉబర్, రాపిడో బైక్‌ సర్వీసులను నిలిపివేస్తూ  ఢిల్లీ రవాణాశాఖ ఆదశాలు జారీ చేసింది. వాటి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని కోరింది. అంతేకాదు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  ఇప్పటికే మహారాష్ట్ర నిషేధాన్ని  ఎదుర్కొంటున్న క్యాబ్‌ సేవల సంస్థలు  ఓలా, ఉబెర్‌, ర్యాపిడో మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. 

రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, రాపిడోలు తమ బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలని ఢిల్లీ రవాణా శాఖ ఫిబ్రవరి 20న పబ్లిక్ నోటీసును జారీ చేసింది.రవాణాయేతర (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ గుర్తు/నంబర్లు కలిగిన ద్విచక్ర వాహనాలు ప్రయాణీకులను  తీసుకువెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని, ఇది పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు, మోటారు వాహన చట్టం, 1988ని ఉల్లంఘించినట్టేననని రవాణా శాఖ తెలిపింది.

ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే మొదటి నేరానికి రూ. 5వేలు జరిమానా, రెండు, తదుపరి నేరానికి రూ. 10,000 జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని రవాణా శాఖ హెచ్చరించింది. అంతేకాదు, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తామని తాజా నోటీసులో పేర్కొంది.

మరిన్ని వార్తలు