రిలయన్స్ ‌డీల్‌కు‌ బ్రేక్‌ : బియానీకి భారీ ఎదురుదెబ్బ

19 Mar, 2021 11:17 IST|Sakshi

అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్‌కు ఎదురుదెబ్బ 

రిలయన్స్‌తో ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఏప్రిల్‌ 28న వ్యక్తిగతంగా హాజరుకావాలని బియానీ, ఇతర డైరెక్టర్లకు స్పష్టీకరణ  

సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్‌ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  గ్రూప్‌ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్‌ విబేధాలకు సంబంధించి సింగపూర్‌ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్‌ (ఈఏ) 2020 అక్టోబర్‌ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్‌ గ్రూప్‌ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్‌కు నిర్మలాజీ షాక్‌)

కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది.  ఫ్యూచర్‌ గ్రూప్‌ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్‌ ‌ గ్రూప్‌ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్‌’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో  సీనియర్‌ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్‌ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్‌ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్‌ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్‌ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్‌ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు