వాట్సాప్‌ను తప్పుపట్టిన ఢిల్లీ హైకోర్టు

27 Aug, 2022 03:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక వేదిక వాట్సాప్‌ 2021 ప్రైవసీ పాలసీని ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. యూజర్లను ‘స్వీకరించండి లేదా వదిలేయండి’ అనే పరిస్థితిలోకి నెట్టేలా ఈ విధానం ఉందని పేర్కొంది. ఎండమావుల వంటి చాయిస్‌లతో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకునేలా యూజర్లను ఒత్తిడి చేస్తోందని, వారి వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటోందని తప్పుపట్టింది. వాట్సాప్‌ 2021 ప్రైవసీ పాలసీపై దర్యాప్తు జరపాలంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేసింది. 

మరిన్ని వార్తలు