అక్కడ రెస్టారెంట్లకు ఓకే.. లిక్కర్‌కి నాట్‌ ఓకే

15 Jun, 2021 16:34 IST|Sakshi

యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో బార్లకు అనుమతి

రెస్టారెంట్లు, క్లబ్బులకు సైతం పర్మిషన్‌ మంజూరు

లిక్కర్‌ అమ్మకాలపై కొనసాగుతున్న నిషేధం

ఢిల్లీలో పుంజుకోని హోటల్స్‌, రెస్టారెంట్‌ ఇండస్ట్రీ 

న్యూఢిల్లీ : మందుబాబులకు ఢిల్లీ సర్కారు ఝలక్‌ ఇచ్చింది. క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు పర్మిషన్‌ ఇస్తూనే లిక్కర్‌ సర్వింగ్‌కి నో చెప్పింది. ట్రయల్‌ బేసిస్‌ మీద జూన్‌ 6 నుంచి 21 వరకు యాభై శాతం సీటింగ్‌ కెపాసిటీతో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు తెరుచుకోవడంతో ఓ పెగ్గు వేద్దామని వెళ్లిన మందుబాబులకు నిరాశే ఎదురవుతోంది. రెస్టారెంట్లు, బార్లలో ఆల్కహాల​్‌ అమ్మకాలకు చేయకూడదంటూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు ఉండటంతో చుక్క మందు కూడా వాళ్లకి దొరకలేదు. 

కఠిన చర్యలు
కోవిడ​ కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 5 వరకు కఠిన లాక్‌డౌన్‌ అమలు చేసింది ఢిల్లీ సర్కార్‌. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగా రెస్టారెంట్లు ఓపెన్‌ చేసినా మందుకు మాత్రం నో చెప్పింది. ఢిల్లీ బాబులు బార్లలో గొంతు తడుపుకోవాలంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. బార్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆల్కహాల్‌ అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ హెచ్చరించింది. 

త్వరగా ఇవ్వండి
కరోనా కారణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల రంగం భారీ నష్టాలు చవి చూస్తోందని. పరిస్థితులను అంచనా వేసి త్వరగా తమకు లిక్కర్‌ అనుమతులు ఇవ్వాలంటూ వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

చదవండి:‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్‌ నంబరు తప్పనిసరి

మరిన్ని వార్తలు