'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌!

13 Feb, 2024 11:01 IST|Sakshi

మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్‌అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్‌) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్‌లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం.

రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు.

స్ట్రైక్‌ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే.

డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్‌కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్‌లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది.

ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ!

A post shared by Delivery Job UK (@deliveryjobuk)

whatsapp channel

మరిన్ని వార్తలు