భవిష్యత్ అంతా అందులోనే!.. ఉద్యోగాలు పెరుగుతాయ్..

8 Feb, 2024 17:08 IST|Sakshi

2023 నుంచి ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలు గాల్లో దీపంలాగా అయిపోయాయి. ఈ ప్రభావం 2024 ప్రారంభం నుంచి కనిపిస్తోంది. అయితే ఇటీవల నౌక్రి జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ఉద్యోగాల నియామకాలు, ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉందనే చాలా విషయాలను వెల్లడించింది.

2024 జనవరిలో హెల్త్‌కేర్ , హాస్పిటాలిటీ, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ వంటి రంగాల్లో ఏఐ సంబంధిత ఉద్యోగాల నియామకాలు భారీగా పెరిగాయని నౌక్రి నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో జనవరి నెలలో 2455 నియామకాలు జరిగినట్లు సమాచారం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఉద్యోగాలు జనవరిలో అంతకు ముందు సంవత్సరం కంటే 12% పెరిగాయి. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అండ్ ఫుల్ స్టాక్ ఏఐ సైంటిస్ట్ వంటి ఉద్యుగుల నియామకాలు కూడా గణనీయంగా పెరిగాయి. డేటా సైంటిస్ట్ వంటి వాటిలో కూడా ఏఐ నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

అడ్మినిస్ట్రేటివ్ రోల్స్‌లో హెల్త్‌కేర్ రంగంలో నియామకాలు 7% , ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్‌లో 5% పెరుగుదల ఒక్క జనవరిలోనే నమోదైంది. ముఖ్యంగా బెంగళూరు, ముంబైలలో ఈ రంగంలో నియామకాలు ఎక్కువగా జరిగాయి. అయితే ఐటీ రంగంలో మాత్రం రోజురోజుకి ఉద్యగాలు పోతున్నాయి. గత ఏడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో ఐటీ నియామకాలు 19 శాతం తక్కువ కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

నైపుణ్యం పెంచుకోండి..
ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని. ఇప్పటికే పలువురు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరాలకునేవారికి కూడా ఉద్యోగావకాలు రాకుండా పోతున్నాయని, మారుతున్న టెక్నాలజీలకు అనుకూలమైన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని వెల్లడించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega