New milestone: వావ్‌.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి

6 Sep, 2022 12:28 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. ఆగస్టులో తొలిసారిగా 100 మిలియన్ల మార్కును టచ్‌ చేయడం విశేషం.  కోవిడ్‌కు ముందు ఈ సంఖ్య 41 మిలియన్లకంటే తక్కువే. 

డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్‌) సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (డీసీఎస్‌ఎల్‌) విడుదల చేసిన డేటా ప్రకారం, 2.2 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు వచ్చాయి. ఈ  నాలుగు నెలల్లో మరీ ముఖ్యంగా గత నెలలో కొత్తగా వచ్చిన ఖాతాలతో  మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 100.5 మిలియన్లకు చేరింది. కోవిడ్-19 మహమ్మారికి ముందు కోవిడ్-19 మహమ్మారికి ముందు అంటే మార్చి 2020లో ఈ సంఖ్య  40.9 మిలియన్లుగా ఉండటం గమనార్హం.

బుల్లిష్‌ మార్కెట్‌ కొత్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.అలాగే మార్కెట్‌లో డీప్‌ కరెక్షన్‌ కారణంగా జూన్‌లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్స్‌ 1.8 మిలియన్ల వద్ద 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.  అయితే మార్కెట్లు అంతే వేగంగా రీబౌండ్‌ కావడంతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. అలాగే 100 మిలియన్ల డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలోని ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్యకు ప్రాతినిధ్యం వహించదని చాలా నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందని మార్కెట్‌ పెద్దల మాట. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్‌  పలు బ్రోకరేజీల వద్ద డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉన్న నేపథ్యంలో చాలా వరకు నకిలీ ఖాతాలుండే అవకాశం ఉందంటున్నారు

మరిన్ని వార్తలు