ఈ పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15 వేలు మీ సొంతం

30 Aug, 2021 17:29 IST|Sakshi

మీకు ఫోటో డిజైనింగ్ విషయంలో నైపుణ్యం ఉందా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ రూపకల్పన చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు నగదు బహుమతి అందించనుంది. "సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాలు ఏమిటి? వాటితో కూడిన ఒక పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15,000 వరకు గెలుచుకునే అవకాశం ఉంది!" అని కేంద్రం ట్వీట్ చేసింది.(చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఇదీ పరిస్థితి!)

భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న సందర్భంగా విజ్ఞాన్ ప్రసార్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పోస్టల్ స్టాంప్ డిజైన్ పోటీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ www.mygov.in ఓపెన్ చేసి మీ వివరాలు సమర్పించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2021 రాత్రి 11.45. మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000, మూడు కన్సోలేషన్ ప్రైజ్ రూ.2,000. ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

మరిన్ని వార్తలు