యాక్టివా 125 ప్రీమియం ఎడిషన్‌

8 Dec, 2021 09:04 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్‌ ఇండియా తాజాగా యాక్టివా 125 స్కూటర్‌ ప్రీమియం ఎడిషన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర డ్రమ్‌ బ్రేక్స్‌  రూ.78,725, డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ రూ.82,280 ఉంది. డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్, సెమి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్, ఏసీజీ సైలెంట్‌ స్టార్ట్‌ సిస్టమ్, ఐడ్లింగ్‌ స్టాప్‌ స్టార్ట్‌ సిస్టమ్, బ్లాక్‌ ఇంజన్, బ్లాక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌ వంటి హంగులు ఉన్నాయి. ప్రీమియం గ్రాఫిక్స్, లుక్‌ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది.   

మరిన్ని వార్తలు