Gaming: రాక్షసులను భయపెట్టండి

14 Jan, 2022 09:03 IST|Sakshi

ఈ వారం గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకునే వీడియో గేమ్స్‌లో ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌ అండ్‌ మాన్‌స్టర్‌ హంటర్స్‌ రైజ్‌’ ఒకటి. ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ సిరీస్‌ ఎంత పాపులరో మనకు తెలిసిందే. ఈ పరంపర లో వచ్చిన తాజాగేమ్‌ ఇది. దీనిలో విజువల్స్‌ ఇంప్రూవ్‌ చేశారు. 4కె రిజల్యూషన్‌కు సపోర్ట్‌ చేస్తుంది. యుద్ధానికి సంబంధించిన నక్కజిత్తులు, సాంకేతికజ్ఞానానికి ఆలవాలమైన కముర గ్రామంలో జరిగే ఈ గేమ్‌ మొదటిసారి పీసీకి వస్తుంది.

 ‘కొత్త రకం రాక్షసులు, కొత్తరకం యుద్ధవిద్యలు,  న్యూ బ్రాండ్‌ స్టోరీతో వస్తుంది’ అనే వూరింపులు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఈ గేమ్‌కు సంబంధించి ‘హౌ టూ చేంజ్‌ వెపన్స్‌’ ‘హౌ టు షార్పెన్‌ వెపన్‌’ ‘హౌ టు గెట్‌ టు వెపన్‌ ట్రైనింగ్‌ ఏరియా’....మొదలైన దారి సూచికలు కూడా నెట్‌లో కనిపిస్తున్నాయి. నిన్‌టెండో స్విచ్‌ ప్లేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అలరించనుంది. 


 

మరిన్ని వార్తలు