స్వఛ్చందసేవకు ఆసరాగా...హెచ్‌సీఎల్‌

31 May, 2022 19:06 IST|Sakshi

విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పనిచేస్తున్న ఎన్‌జీఓలకు ఆర్ధికంగా సాయం చేసేందుకు ప్రత్యేక గ్రాంట్‌ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డైరెక్టర్‌ నిధి పుందిర్ తెలిపారు. హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ 8వ ఎడిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం...
హెచ్‌సిఎల్‌ ఫౌండేషన్‌లో భాగంగా హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ను 2015లో లాంచ్‌ అయింది. మా సాయం పొందేందుకు ఒక ఎన్‌జీఓ ప్రారంభించి కనీసం మూడేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సంస్థల నిర్వహణ, అందిస్తున్న సేవల్లో పారదర్శకత వంటివి చూసి కేటగిరీల వారీగా ఎంపిక చేస్తాం. మా ప్రాధామ్యాల పరంగా సరితూగే సంస్థలను నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. కేటగిరీ వారీగా 3 ఫైనలిస్ట్స్‌ను ఎంపిక చేశాక  ఏడాదికి మొత్తం రూ. 16.5 కోట్లు చొప్పున అందిస్తాం. మరో 30 ఎన్‌జిఓ సంస్థల గురించి ఒక పుస్తకం ప్రచురిస్తాం. ప్రస్తుతం 6వ వాల్యూమ్‌ ప్రచురించనున్నాం. అది ప్రభుత్వ శాఖలు, దాతలకు చేరుతుంది.  వాళ్ల కార్యక్రమాల శైలులు అందరికీ తెలుస్తాయి.

దరఖాస్తులకు ఆహ్వానం...
ఇది 8వ ఎడిషన్‌. ఇటీవలే అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేశాం. ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప సాధారణంగా 60 రోజులు ఓపెన్‌ చేసి  ఉంచుతాం. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా తప్ప మరే విధంగాననూ దరఖాస్తులు స్వీకరించం. ఏ రాష్ట్రం నుంచైనా, ఏ నగరం, జిల్లా,గ్రామం నుంచైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు.  వీలైనన్ని ఎక్కువ ఎన్‌జిఓ సంస్థలు దీని గురించి తెలుసుకోవాలనేదే మా ఉద్ధేశ్యం. అందుకే నగరాల వారీగా సింపోజియమ్స్‌ నిర్వహిస్తున్నాం. ఎన్‌జీఓలు వాటికి అర్హతలు ఉన్నా లేకున్నా దీనికి హాజరు కావచ్చు.  సీఎస్‌ఆర్‌ చట్టాలు,, ప్రాంతీయ అంశాలు, ఉపయుక్తమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ సదస్సులు ఉపకరిస్తాయి. విభిన్న మార్గాల ద్వారా ఎన్‌జీఓలు సాయం పొందే అవకాశాలు కూడా తెలుస్తాయి. 

చదవండి: ఉక్రెయిన్‌ కోసం గూగుల్‌.. సుందర్‌ పిచాయ్‌ డేరింగ్‌ స్టెప్‌.

మరిన్ని వార్తలు