ఏప్రిల్‌లో ఎగుమతుల రికార్డు

14 May, 2022 18:43 IST|Sakshi

40 బిలియన్‌ డాలర్లుగా నమోదు  

న్యూఢిల్లీ: భారత్‌ ఏప్రిల్‌ ఎగుమతులకు సంబంధించి రెండవ విడత సవరిత గణాంకాలు మరింత మెరుగ్గా వెలువడ్డాయి. ఎగుమతులు 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. భారత్‌ ఎగుమతుల చరిత్రలో ఈ స్థాయి గణాంకాల నమోదు ఇదే తొలిసారి. ఇక దిగుగుమతులు 30.97 శాతం పెరిగి 60.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 20.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

2021 ఏప్రిల్‌లో ఈ లువ 15.29 బిలియన్‌ డాలర్లు. కాగా పసిడి దిగుమతులు 72 శాతం పడిపోయి 1.72 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవలకు సంబంధించి ఎగుమతుల విలువ ఏప్రిల్‌లో 53 శాతం పెరిగి 27.60 బిలియన్‌ డాలర్లకు చేరగా, దిగుమతుల విలువ 62 శాతం పెరిగి 16 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.   

చదవండి: ఉక్రెయిన్‌ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్‌!

మరిన్ని వార్తలు