Jiomart Express: వచ్చేస్తోంది.. జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌..

4 Jun, 2022 17:01 IST|Sakshi

గ్రాసరీస్‌ హోం డెలివరీ సర్వీస్‌లపై బడా కంపెనీలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే స్టార్టప్‌లు ఈ రంగంలో దూసుకుపోతుండగా మార్కెట్‌ బిగ్‌ ప్లేయర్స్‌ సైతం రంగంలోకి దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో భాగంగా జియో సంస్థ సైతం సన్నహకాలు జోరుగా సాగిస్తోంది.

గ్రోసరీస్‌ డెలివరీ సర్వీసులను జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చేందుకు రిలయన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నవీ ముంబైలో ఈ సేవలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 200 నగరాలు, పట్టణాల్లో భారీ ఎత్తున గ్రాసరీస్‌ డెలివరీ చేయాలని డిసైడ్‌ అయ్యింది.

జెప్టో, బ్లింకిట్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు పది నిమిషాల్లో గ్రోసరీస్‌ డెలివరీ లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయితే రిలయన్స్‌ సంస్థ ఇటువంటి టార్గెట్స్‌లను పెట్టుకోలేదు. 90 నిమిషాల్లో డెలివరీకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన రిలయన్స్‌ మార్క్ట్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటూ సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం ఫ్రీ హోం డెలివరీకి కనీసం రూ.199 బిల్‌ చేయాల్సి ఉంటుంది. 

చదవండి: కొత్త బిజినెస్‌లోకి యాపిల్‌, గూగుల్‌ ఫ్యూచర్‌ ఏంటో!

మరిన్ని వార్తలు