మొదలైన 5జీ మొబైల్‌ వార్‌.. రంగంలోకి దిగిన పోకో

23 Jun, 2022 21:24 IST|Sakshi

మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌లో మరోసారి వేడి రగులుకుంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పనులు ఊపందుకోవడంతో మార్కెట్‌లోకి కొత్త మోడళ్లను రిలీజ్‌ చేయడంపై మొబైల్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి.  అందులో భాగంగా  షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో  సరికొత్త 5జీ ఫోన్‌ రిలీజ్‌ చేసింది. 5జీ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి పోటీ కంపెనీల కంటే ముందుగా పోకో సంస్థ ఎఫ్‌4 పేరుతో 5జీ ఫోన్‌ మార్కెట్‌లోకి వదిలింది. ఇందులో లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ను ఉపయోగించడంతో పాటు మరెన్నో అకట్టుకునే ఫీచర్లు పొందుపరిచింది పోకో.

ఫీచర్లు
- క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 ఎస​ఓసీ చిప్‌సెట్‌
- ఆం‍డ్రాయిడ్‌ 12, ఎంఐయూఊ 13 యూజర్‌ ఇంటర్‌ఫేస్‌
- 6.7 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ అమెల్డ్‌ డిస్‌ప్లే
- 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 360 హెర్జ్‌ టచ్‌ సాంప్లింగ్‌ రేట్‌
- ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 64 మెగా పిక్సెల్‌
- 20 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
- డాల్బీ ఆట్మోస్‌, డాల్బీ విజన్‌ 
- కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 
-  5 జీ సపోర్ట్‌
- జైరో స్కోప్‌, మాగ్నెటో మీటర్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
- 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

ధరలు ఇలా
పోకో ఎఫ్‌ 4 5జీ ఫోన్‌ వివిధ వేయింట్లలో లభిస్తోంది. అన్నింటి కంటే తక్కువగా 6జీబీ ర్యామ్‌  126 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.27,999లు ఉండగా హై ఎండ్‌ మోడల్‌ 12 జీబీ ర్యామ్‌ 256 జీమీ స్టోరేజ్‌తో రూ.33,999 దగ్గర లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ సేల్‌కు అందుబాటులో ఉంది. వివిధ బ్యాంకుల క్రెడిట్‌/డెబిట్‌ కార్డులతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల ద్వారా అదనంగా రూ.3000ల వరకు తగ్గింపు పొందవచ్చు.
 

చదవండి: బడ్జెట్‌ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు