ఈ వారంలో రెండు ఐపీవోలు..

29 Nov, 2021 08:28 IST|Sakshi

ఐపీవోకి రెడీ అయిన స్టార్‌ హెల్త్, టెగా ఇండస్ట్రీస్‌

న్యూఢిల్లీ: మార్కెట్లో పబ్లిక్‌ ఇష్యూల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ వారం మరో రెండు సంస్థలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కి వస్తున్నాయి. వీటిలో స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, టెగా ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. ఇవి రెండు కలిసి సుమారు రూ. 7,868 కోట్లు సమీకరించనున్నాయి. స్టార్‌ హెల్త్‌ ఐపీవో నవంబర్‌ 30న మొ దలై డిసెంబర్‌ 2న ముగుస్తుంది. అటు టెగా ఇండస్ట్రీస్‌ ఇష్యూ డిసెంబర్‌ 1–3 మధ్య ఉంటుంది. స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ షేరు ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. సుమారు రూ. 7,249 కోట్లు సమీకరిస్తోంది.అటు టెగా ఇండస్ట్రీస్‌ రూ. 619 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూ తలపెట్టింది. షేరు ధర శ్రేణి రూ. 443–453.  
ఇప్పటిదాకా 51 కంపెనీలు..  
ఈ ఏడాది ఇప్పటిదాకా 51 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 1 లక్ష కోట్ల పైగా సమీకరించాయి. నవంబర్‌లోనే 10 సంస్థలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. ఈ స్థాయిలో చివరిగా 2017లో ఐపీవోల సందడి కనిపించింది. అప్పట్లో 36 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి రాగా రూ. 67,147 కోట్ల నిధులు దక్కించుకున్నాయి.
 

చదవండి: ప్రపంచంలో అతి పెద్ద ఐపీవో

మరిన్ని వార్తలు