స్టార్‌ హెల్త్‌ ఐపీవో.. రూ.7,249 కోట్లు సమీకరణ

25 Nov, 2021 10:08 IST|Sakshi

షేరు ధర శ్రేణి రూ. 870–900 

- నవంబర్‌ 30న ప్రారంభం 

 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆరోగ్య బీమా దిగ్గజం స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 7,249 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇందుకోసం షేర్ల ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. నవంబర్‌ 30న ప్రారంభమయ్యే ఇష్యూ డిసెంబర్‌ 2తో ముగుస్తుంది. కనీసం 16 షేర్ల కోసం బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను రిజర్వ్‌ చేశారు.  వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి దిగ్గజ ఇన్వెస్టర్లకు ఇందులో పెట్టుబడులు ఉన్నాయి.   

డ్రీమ్‌ స్పోర్ట్స్‌ రూ. 6,252 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: స్పోర్ట్స్‌ టెక్‌ కంపెనీ డ్రీమ్‌ స్పోర్ట్స్‌ తాజాగా 84 కోట్ల డాలర్లు(రూ. 6,252 కోట్లు) సమీకరించింది. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలలో ఫాల్కన్‌ ఎడ్జ్, డీఎస్‌టీ గ్లోబల్, డీ1 క్యాపిటల్, రెడ్‌బర్డ్‌ క్యాపిటల్, టైగర్‌ గ్లోబల్‌ తదితరాలున్నాయి. దీంతో కంపెనీ విలువ 8 బిలియన్‌ డాలర్లను తాకింది. అంతేకాకుండా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన టీపీజీ, పుట్‌పాత్‌ వెంచర్స్‌ తదితరాలు సైతం నిధులను సమకూర్చాయి.
 

మరిన్ని వార్తలు