TATA Nexon EV: టాటా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌.. సింగిల్‌ చార్జ్‌తో 437 కి.మీ రేంజ్‌

12 May, 2022 08:21 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం. 40.5 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ పొందుపరిచారు. నెక్సాన్‌ ఈవీతో పోలిస్తే కొత్త మోడల్‌ బ్యాటరీ సామర్థ్యం 33 శాతం అధికం అని కంపెనీ వెల్లడించింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 437 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. 9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

 నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌లో సౌకర్యం, భద్రతకు సంబంధించి నూతనంగా 30 ఫీచర్లను జోడించారు. క్రూయిజ్‌ కంట్రోల్, ఆటో డిమ్మింగ్‌ ఐఆర్‌వీఎం, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్, ఎయిర్‌ ప్యూరిఫయర్, ముందువైపు సీట్‌ వెంటిలేషన్‌ వంటి హంగులు ఉన్నాయి. ప్రయాణికుల విభాగంలో ఇప్పటి వరకు టాటా మోటార్స్‌ 25,000 పైచిలుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది. ఇందులో 19,000లకుపైగా నెక్సాన్‌ ఈవీ  లు ఉన్నాయి. 2021–22లో ఈవీ విక్రయాల్లో 353% వృద్ధి సాధించింది. వచ్చే అయిదేళ్లలో ఈ విభాగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
చదవండి: మెర్సిడెస్‌ నుంచి కొత్త కారు.. ప్రారంభానికి ముందే అదిరిపోయే బుకింగ్స్‌!

మరిన్ని వార్తలు