Xiaomi Note 11: అదిరిపోయే కెమెరా, బ్యాటరీ ఫీచర్లు.. షావోమి నుంచి కొత్త ఫోన్‌

26 Jan, 2022 19:18 IST|Sakshi

Xiaomi Note 11 Series Specifications: ఇండియాలో నంబర్‌ వన్‌ బ్రాండ్‌గా చెలరేగిపోతున్న షావోమి నుంచి కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి రాబోతుంది. షావోమిలో సక్సెస్‌ఫుల్‌ మోడల్‌గా పేరున్న నోట్‌ నుంచి ఈ ఫోన్‌ రానుంది.  షావోమిలో రెడ్‌మీ సిరీస్‌ తర్వాత ఎక్కువగా సక్సెస్‌ అయిన మోడల్‌ నోట్‌. వివిధ రకాల మోడళ్లను షావోమి తీసుకువచ్చినా నోట్‌ సిరీస్‌ మార్కెట్‌లో చెదరని ముద్ర వేసింది. అందుకే గత ఐదున్నరేళ్లుగా నోట్‌ సిరీస్‌ని క్రమం తప్పకుండా షావోమి కొనసాగిస్తోంది. ఈ పరంపరలో తాజాగా నోట్‌ 11 సిరీస్‌ని ఇండియాలోకి తేబోతున్నట్టు షావోమి ప్రకటించింది. ఫ్రిబవరిలో ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి రానుంది. వివిధ వేరియంట్లు, ఫీచర్లను బట్టి ఈ ఫోన్‌ ప్రైస్‌ రేంజ్‌ రూ.13,400ల నుంచి రూ.22,400 వరకు ఉంది.

షావోమి నోట్‌ 11 సిరీస్‌ ఫీచర్లు
- కెమెరా 50/104 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా (రియర్‌)
- 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33/67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
- ‍స్ల్పాష్‌ ప్రూఫ్‌ 53 సర్టిఫికేట్‌,
- 90/120 హెర్జ్‌, అమోల్డ్‌ డిస్‌ప్లే
- మీడియాటెక్‌ హెలియో జీ 96 చిప్‌ (5జీ ఫోన్‌కి స్నాప్‌డ్రాగన్‌ 695 చిప్‌)
- నోట్‌ 11 సిరీస్‌లో నోట్‌ 11 ఎస్‌, నోట్‌ 11 ప్రో, నోట్‌11 ప్రో5జీ వేరియంట్లు ఉన్నాయి
- ప్రో, ఎస్‌ వేరియంట్‌లలో హైఎండ్‌ ఫీచర్లు లభిస్తాయి.
- 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ చేస్తుంది
- డ్యూయల్‌ స్పీకర్స్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌
- 1 టీబీ వరకు మెమెరీ పెంచుకునే అవకాశం
 

చదవండి: చైనా మొబైల్‌ కంపెనీలకు యాపిల్‌ షాక్‌!

మరిన్ని వార్తలు