ఆదాయ పన్ను రిటర్నులు అప్‌

13 Jun, 2022 08:18 IST|Sakshi

సీబీడీటీ చైర్మన్‌ సంగీతా సింగ్‌ వెల్లడి  

పనాజీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో ఆదాయ పన్ను రిటర్నులు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్‌ సంగీతా సింగ్‌ పేర్కొన్నారు. గతేడాదిలో 6.9 కోట్ల నుంచి 7.14 కోట్లకు రిటర్నులు పుంజుకున్నట్లు వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య బలపడటంతోపాటు.. సవరించిన రిటర్నులు మెరుగుపడినట్లు తెలియజేశారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి అద్దంపట్టే పన్ను వసూళ్లు ఇటీవల ఊపందుకున్నట్లు తెలియజేశారు. ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటే అమ్మకాలు, కొనుగోళ్లు సైతం వృద్ధి చూపనున్నట్లు వివరించారు. గతేడాది పన్ను వసూళ్లు రూ. 14 లక్షల కోట్లను అధిగమించినట్లు వెల్లడించారు.
 

చదవండి: ఆధార్‌ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు