ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం

14 Feb, 2021 14:34 IST|Sakshi

సాక్షి, ముంబయి: వాతావరణ కాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మధ్య ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు విషయంలో ఆసక్తి  చూపుతున్నారు. చాలా వరకు కంపెనీలు కూడా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ముంబయిలో జరిగిన "ఇండియా ఆటో షో 2021"లో ప్రపంచంలోని అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం “డిటెల్ ఈజీ ప్లస్”ను డిటెల్ ఆవిష్కరించింది. 2021 ఏప్రిల్‌లో రోడ్డు మీదకు రానున్న ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మన భారత రోడ్లకు సరిగ్గా సరిపోతుందని కంపెనీ పేర్కొంది. ద్విచక్ర వాహనం 4 రంగుల్లో అంటే ఎల్లో, రెడ్, రాయల్ బ్లూ, టీ బ్లూలో లభిస్తుంది.

 
ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి ఇటీవల భారత ప్రభుత్వం వివిధ ప్రచారాలను నిర్వహిస్తుంది. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ఎలక్ట్రిక్ వాహనాలను సరసమైన ధరలో విక్రయించడానికి, రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారంతో పలు కంపెనీలు కూడా ముందు కొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై డెటెల్ వ్యవస్థాపకుడు డాక్టర్ యోగేష్ భాటియా మాట్లాడుతూ.. “భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సరికొత్త సంచలనాలు సృష్టించడానికి మేము అన్ని ప్రయత్నాలు  చేస్తున్నాము" అని అన్నారు. డెటెల్ నుంచి రాబోయే కొత్త వాహనాల ధర రూ.20,000 ఉంటుందనే అంచనా ఉంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని డెటెల్ కంపెనీ పిలుపునిస్తుంది.

చదవండి:

ఎంజీ హెక్టార్‌ సరికొత్తగా, ధర ఎంత?

మరిన్ని వార్తలు