గుజరాత్‌లో జర్మన్‌ బ్యాంక్‌, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?!

13 Aug, 2021 09:11 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని తొలి గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌(ఐఎఫ్‌ఎస్‌సీ)లో బ్యాంకింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు జర్మనీ దిగ్గజం డాయిష్‌ బ్యాంక్‌కు తాజాగా అనుమతి లభించింది. ఇందుకు గిఫ్ట్‌(జీఐఎఫ్‌టీ) ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) అథారిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి గిఫ్ట్‌ సిటీ సెజ్‌లో డాయిష్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ బ్యాంకింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది.

 కాగా.. డాయిష్‌ బ్యాంక్‌కు అనుమతి నేపథ్యంలో మరిన్ని విదేశీ దిగ్గజాలు గిఫ్ట్‌ సిటీవైపు దృష్టిసారించే వీలున్నట్లు తపన్‌ రాయ్‌ పేర్కొన్నారు. దీంతో విదేశీ బ్యాంకులకు ఎఫ్‌పీఐ, ఎన్‌డీఎఫ్, ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌ తదితర పలు బిజినెస్‌ అవకాశాలు లభించనున్నట్లు గిఫ్ట్‌ సిటీ గ్రూప్‌ ఎండీ, సీఈవో రాయ్‌ వివరించారు.

 ప్రధానంగా ఫైనాన్సింగ్, ట్రేడ్, కరెన్సీలు తదితర విభాగాలలో తమ క్లయింట్లకు అంతర్జాతీయ బిజినెస్‌ లావాదేవీల నిర్వహణకు ఈ యూనిట్‌ సహకరించనున్నట్లు డాయిష్‌ బ్యాంక్‌ సీఈవో కౌశిక్‌ షపారియా తెలియజేశారు. ఇప్పటివరకూ దేశీ కార్యకలాపాలపై రూ. 19,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. గిఫ్ట్‌ సిటీలో 2015లో ఏర్పాటైన ఐఎఫ్‌ఎస్‌సీ ఫైనాన్షియల్‌ రంగంలోని పలు దేశ, విదేశీ సంస్థలను ఆకట్టుకుంటోంది. 

>
మరిన్ని వార్తలు