కుప్పకూలిపోయాను..డియర్‌..RIP: కిరణ్‌మజుందార్‌ షా భావోద్వేగం

25 Oct, 2022 10:09 IST|Sakshi

బెంగళూరు: బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదంపై భావోద్వానికి లోనయ్యారు.  దీపావళి పర్వదినం రోజు తనను శాశ్వతంగా విడిచివెళ్లిన భర్త జాన్ షా ను గుర్తు చేసుకుంటూ ట్విటర్‌ పోస్ట్‌ ద్వారా కన్నీటి నివాళి అర్పించారు.

‘‘కుంగిపోయాను.. నా భర్త, సోల్‌ మేట్‌, గురువును కోల్పోయాను. నా లక్క్ష్య సాధనలో జాన్‌ ఎప్పుడూ చాలా అండగా నిలిచారు. ఎంతో మార్గనిర్దేశనం చేశారు. నా జీవితాన్ని ఇంత స్పెషల్‌గా ఉంచి నందుకు ధన్యవాదాలు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ మై డియర్‌ జాన్‌...మీరు లేని లోటు పూడ్చలేనిది’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

కేన్సర్‌తో బాధపడుతున్న జాన్ షా (73)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  సోమవారం కన్నుమూశారు. దీంతో పలువురు వ్యాపార, రాజకీయ పెద్దలు ఆమెకు  తమ ప్రగాఢ  సానుభూతి  ప్రకటించారు. కాన్సర్‌తో బాధపడుతూ కిరణ్ మజుందార్ షా  తల్లి యామిని మజుందార్‌ షా  ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. ఇపుడు భర్తను కోల్పోవడంతో కిరణ్‌ విషాదంలో మునిగిపోయారు.

కాగా స్కాటిష్ జాతీయుడైన జాన్‌షా 1998లో కిరణ్ మజుందార్ షాను వివాహం చేసుకున్నారు.  తరువాత వివిధ బయోకాన్ గ్రూప్ కంపెనీల సలహా బోర్డు సభ్యుడు సేవలందించారు.  1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌  ఒకరిగా వివిధ హోదాల్లో పనిచేశారు. విదేశీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందించారు. 1999లో బయోకాన్‌లో చేరడానికి ముందు వస్త్ర తయారీదారు మధుర కోట్స్‌కు నాయకత్వం వహించారు జాన్‌ షా. జూలై 2021లో పదవీ విరమణకు ముందు బయోకాన్ వైస్ ఛైర్మన్ ,నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా 22 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు  అందించారు.

మరిన్ని వార్తలు