భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?

27 Aug, 2021 12:16 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్‌ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్‌ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతులు ఇచ్చింది.

ప్రమాదాల జరగడం వల్లే
జంబో విమానాల తయారీకి బోయింగ్‌ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్‌ సెక్టార్‌లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్‌, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్‌ సెక్టార్‌ నుంచి తొలగించాయి. భారత్‌ సైతం 2019 మార్చిలో బోయింగ్‌ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఎప్పటి నుంచి
రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్‌ జెట్‌ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్‌ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది.  మరోవైపు దుబాయ్‌ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది.

పారదర్శకత ఏదీ
బోయింగ్‌ విమానాల కమర్షియల్‌ ఆపరేషన్స్‌కి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్స్‌ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్‌ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. 

చదవండి: బంపర్‌ టూ బంపర్‌ ఇన్సురెన్స్‌ తప్పనిసరి..మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు