Dgca Report : పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య

18 Sep, 2021 10:29 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టివచ్చారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 33.8 శాతం అధికం.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రకారం.. ఏప్రిల్‌లో 57.25 లక్షలు, మే నెలలో 21.15, జూన్‌లో 31.13, జూలైలో 50 లక్షల మంది ప్రయాణం చేశారు. గణాంకాలనుబట్టి మే నెలలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గత నెలలో ఇండిగో 38.16 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి 57 శాతం వాటాను దక్కించుకుంది. స్పైస్‌జెట్‌ 5.84 లక్షల మంది ప్రయాణికులతో 8.7 శాతం వాటా పొందింది.

ఎయిర్‌ ఇండియా 8.86 లక్షలు, గో ఫస్ట్‌ 4.58, విస్తారా 5.58, ఎయిర్‌ ఏషియా 3.49 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేట్‌ 60.3–79.6 శాతం మధ్య నమోదైంది. స్పైస్‌జెట్‌ అత్యధికంగా 79.6 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.  

చదవండి: భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?

మరిన్ని వార్తలు