ఐఫోన్‌ కోసం దుబాయ్‌ వెళ్లాడు..కానీ చివరికి

19 Sep, 2022 16:41 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లు ప్రపంచ దేశాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాటి ధర ఎక్కువే అయినప్పటికీ..డైహార్డ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఐఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్డర్‌లు పెడుతున్నారు. మన దేశంలో విడుదల కాకపోవడంతో లేటెస్ట్‌ ఫోన్‌ కోసం విదేశాలకు వెళుతున్నారు. 

మనదేశంలో మరికొన్ని గంటల్లో ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ విడుదలవుతుందనగా కేరళ రాష్ట్రం కొచ్చీకి చెందిన ధీరజ్ పళ్లియిల్ (28) అనే యువకుడు అదే ఫోన్‌ కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్‌లో మిర్డిఫ్ సిటీ సెంటర్‌లో 512జీబీ ఐఫోన్ 14 ప్రొను కొనుగోలు చేశాడు. ఆఫోన్‌ ధర దుబాయ్‌లో రూ.1,29,000 కాగా..భారత్‌లో రూ.1,59,900కే కొనుగోలు చేయొచ్చు.   

భారత్‌లో తక్కువే 
ధీరజ్‌ ఐఫోన్‌ ప్రో కోసం భారత్‌లో లభించే ధర కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. ఎలా అంటే? భారత్‌ నుంచి దుబాయ్‌ ప్లైట్‌ టికెట్‌ కోసం రాను పోను కలిపి రూ.40వేలు. దుబాయ్‌లో ఫోన్‌ ఖరీదు రూ.1,29,000. ఫ్లైట్‌ టికెట్‌ ధర రూ.40వేలు ప్లస్‌, ఫోన్‌ ధర రూ.1,29,000 ఉండగా మొత్తం కలిపితే. రూ.1,69,000గా ఉంది. అదేదో భారత్‌లో కొంటే రూ.10వేలు తగ్గేదని నెటిజన్‌లు లెక్కలేస్తున్నారు.

కానీ ఐఫోన్‌ను విపరీతంగా అభిమానించే ధీరజ్‌ మాత్రం ఐఫోన్‌ 14ప్రోను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా నిలిచిపోవాలని అనుకున్నాడు. అందుకే దుబాయ్‌ వెళ్లినట్లు తెలిపాడు.ఈ సందర్భంగా తాను 2017లో ఐఫోన్ 8ను, ఆ తర్వాత ఐఫోన్ 12, ఐఫోన్ 13ను అందరికంటే ముందే దుబాయ్‌లో కొనుగోలు చేసి.. ఐఫోన్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయ కస్టమర్ తానేనని సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి👉 ‘భారత్‌కు గుడ్‌ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు!

మరిన్ని వార్తలు