ఆపిల్ బ్లూటిక్‌ను ఫేస్‌బుక్ తొలగించిందా?

25 Dec, 2020 10:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆపిల్ తన ఐఫోన్ మొబైల్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్స్, నిబంధనలు తీసుకొచ్చినప్పటి నుండి ఫేస్‌బుక్ ఆపిల్ కొత్త విధానాలను వ్యతిరేకిస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆపిల్ తన కొత్త విధానాలతో చిన్న వ్యాపారాలకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది. ఈ నిబంధనల విషయంలో మాత్రం ఆపిల్ తనను తాను సమర్థించుకుంది. ఈ వివాదం మధ్య ఫేస్‌బుక్ తన ప్లాట్ ఫామ్ లో ఆపిల్ యొక్క అధికారిక పేజీని తొలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా కన్సల్టెంట్ "మాట్ నవరా" మొట్టమొదటిసారిగా ఫేస్‌బుక్ ఆపిల్ అధికారిక పేజీని గుర్తించలేదని మొదట కనుగొన్నాడు.(చదవండి: టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్)

మాట్ నవరా ఆపిల్ ఫేస్‌బుక్ పేజీ స్క్రీన్ షాట్ ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంటూ "ఫేస్‌బుక్ ఆపిల్ యొక్క పేజీ బ్లూ టిక్ ని తొలగించింది" అని పోస్ట్ చేసాడు. అయితే, ఫేస్‌బుక్‌ బృదంతో తనిఖీ చేసుకున్న తర్వాత నవరా వెంటనే మరో కొత్త పోస్టును పోస్ట్ చేసాడు. ఆ పోస్టులో అధికారిక ఆపిల్ పేజీని ఫేస్‌బుక్ ఎప్పుడూ ధృవీకరించలేదని ఆయన రాశారు. ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ పోడ్కాస్ట్ మరియు ఆపిల్ టీవీతో సహా ఆపిల్ కు చెందిన ఇతర పేజీలన్నీ ఫేస్‌బుక్ చేత ద్రువీకరించబడ్డాయి అని సంస్థ అతనికి తెలిపినట్లు పేర్కొన్నాడు. ప్రధాన ఆపిల్ పేజీ ఎందుకు ధృవీకరించబడకపోవటానికి కారణం ఆ పేజీ యొక్క నిర్వాహకులు ధృవీకరణ కోసం అప్లై చేసుకోలేదని తెలిపాడు.

మరిన్ని వార్తలు