Scam 1992: '1992 స్కాం' వెబ్‌ సిరీస్‌లో రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా క్యారక్టర్‌ ఎవరిదో తెలుసా?

14 Aug, 2022 14:19 IST|Sakshi

1988 నుంచి 1991వరకు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు గోల్డెన్‌ ఇయర్స్‌. అప్పటికే 100ఏళ్ల చరిత్ర ఉన్న బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో ఎప్పుడూ చూడని కొత్త పోకడ మొదలైంది. ఏరోజుకారోజు ఇన్వెస్ట్‌ చేయడం. లాభాలు గడించింది. ఇన్వెస్ట్‌ చేయడం మళ్లీ లాభాల కోసం వెయిట్‌ చేయడం. ఇలా బుల్‌ రన్‌తో సెన్సెక్స్‌ రోజుకో రికార్డ్‌ సృష్టించింది. కానీ 1992 ఏప్రిల్‌ 23 బాంబే స్టాక్‌ మార్కెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ ఇన్వేస్టిగేటీవ్‌ జర్నలిస్ట్‌ సుచేతా దలాల్‌ బాంబు వేసింది. ఆమె రాసిన ఆర్టికల్‌  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష‍్టించింది. 

(రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?)

ఇక సుచేతా దలాల్‌ ఎవరు? ఆమె హర్షద్‌ మెహతాను ఎందుకు టార‍్గెట్‌ చేసింది. ఆ స్కాం ఎలా  చేశారు? బేర్‌ కార్టెల్‌ ఎవరు? ఇవన్నీ అటుంచితే. ఆ స్కాం గురించి 'స్కాం 1992' పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా తెరకెక్కింది. అందులో హర్షద్‌ మెహతా హవా జరిగే సమయంలో ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా ఎలాంటి ఒడిదుడుకు లోనయ్యారనే అంశం బాగా హైలెట్‌ అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలోని రియల్‌ లైఫ్‌ క్యారక్టర్స్‌ ఎవరివో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇదీ చదవండి:  రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2021 నాటి వీడియో వైరల్‌

ప్రతిక్‌ గాంధీ - హర్షద్‌ మెహతా

♦ హర్షద్‌ మెహతా తమ్ముడు అశ్విన్‌ మెహత కేరక్టర్‌లో హేమంత్‌ కేర్‌ యాక్ట్‌ చేశారు

♦ హర్షద్‌ మెహతా భార్య జ్యోతి మెహతా పాత్రలో అంజలీ బారోత్‌ యాక్ట్‌ చేశారు

♦ సుచేతా దలాల్‌ పాత్రలో శ్రేయ దన్వంతరీ యాక్ట్‌  చేశారు

♦ డెబాషిస్‌ పాత్రలో ఫైసల్‌ రషీద్‌ యాక్ట్‌ చేశారు. 

♦ మనుముంద్రా కేరక్టర్‌లో సతీష్‌ కౌషిక్‌ యాక్ట్‌ చేశారు

♦ రాధా కిషన్‌ దమానీ పాత్రలో పరేష్‌ గంట్రా యాక్ట్‌ చేశారు

♦ రాకేష్‌ ఝున్‌ ఝున్‌ వాలా పాత్రలో కెవిన్‌ డేవ్‌ నటించారు

♦ రాం జఠ్మలానీ పాత్రలో మిథులేష్‌ చతుర్వేదీ యాక్ట్‌  చేశారు.

మరిన్ని వార్తలు