'పెగసస్‌' మీ స్మార్ట్‌ఫోన్‌ పై దాడి చేసిందో లేదో తెలుసుకోండిలా?!

21 Jul, 2021 13:00 IST|Sakshi

ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ పెగసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ను డిజైన్‌ చేసింది. అయితే హ్యాకర్స్‌ ను ఈ సాఫ్ట్‌వేర్‌ లీక్‌ చేసి దాని సాయంతో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖుల స్మార్ట్‌ఫోన‍్లలోకి అక్రమంగా చొరబడి రహస్యాల్ని కనిపెట్టేస‍్తోంది. 

దీంతో వినియోగదారులు ఈ వైరస్‌ నుంచి సురక్షితంగా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో యూకేకి చెందిన స్వచ్ఛంద సంస్థ 'అమ్నెస్టీ' ఇంటర్నేషనల్ కాల్డ్‌ మొబైల్‌ వెరిఫికేషన్‌ టూల్‌ (ఎంవీటీ) కిట్‌ ను డిజైన్‌ చేసింది. ఈ టూల్‌ కిట్‌ సాయంతో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లలో పెగసస్‌ దాడి చేసిందా? లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

ఇందుకోసం వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న డేటాను ఎంవీటి ఫోల్డర్‌ లో బ్యాక్‌ అప్‌ చేయాల్సి ఉంటుంది. బ్యాక్‌ అప్‌ చేసిన అనంతరం ప్రోగ్రాం ద్వారా (కమాండ్‌ లైన్‌​ ఇంటర్‌ ఫేస్‌) యూజర్లకు కాంటాక్ట్స్‌,ఫోటోలు దీంతో ఇతర ఫోల్డర్లను చెక్‌ చేస్తుంది. ఒకవేళ కమాండ్‌ లైన్‌ ఇంటర్‌ ఫేస్‌లో పెగసెస్‌ ఉంటే వెంటనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది.  

చదవండి:  ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా

మరిన్ని వార్తలు