మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

20 Jul, 2021 12:57 IST|Sakshi

బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కేటుగాళ్లు ఆధార్‌ కార్డ్‌ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే అలాంటి వారి నుంచి సురక్షితంగా ఉండేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సెక‍్యూరిటీ అప్‌డేట్‌లను అందుబాటులోకి తెస్తోంది. ఈనేపథ్యంలో 12 అంకెల ఆధార్‌ కార్డ్‌ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా మరో ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది

ఈ ఫీచర్‌ ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్‌ లాక్/ అన్‌ లాక్‌ చేసేలా డిజైన్‌ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆధార్‌ కార్డ్‌ సురక్షితంగా ఉండేలా బయో మెట్రిక్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. మీ ఆధార్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్‌ లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయాలి. ఇందుకోసం మీ ఐడీ కార్డ్‌ తప్పనిసరిగా ఉండాలి. 

ప్రాసెస్‌ ఎలా చేయాలి?

 https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లాలి
► అనంతరం  Secure UID Authentication Channel సెక్షన్‌లోకి వెళ్లి Lock UID లేదా Unlock UID ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి. 
► అలా చేసిన తరువాత మీరు మీ 12అంకెల ఆధార్‌తో పాటు సంబంధిత వివరాల్ని యాడ్‌ చేయాల్సి ఉంటుంది. 
► ఫైనల్‌ గా మీఫోన్‌ నెంబర్‌ కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది.
► ఆ ఓటీపీని యాడ్‌ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది.

చదవండిరూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్‌టెల్-వొడాఫోన్‌

మరిన్ని వార్తలు