పర్సనల్‌ లోన్‌, బంగారంపై లోన్‌ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే

25 Jul, 2021 12:10 IST|Sakshi

ప్రతి ఒక్కరికి ఆర్ధిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు బ్యాంక్‌లోన్‌, లేదంటే బంగారంపై లోన్‌ తీసుకోవడమో చేస్తుంటారు. అదే సమయంలో ఏ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకుంటే మంచిదో ఆలోచించరు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామా? లేదా? అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. అయితే ఆర్ధిక నిపుణులు మాత్రం బ్యాంక్‌ లోన్‌, బంగారంపై లోన్‌ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాంక్‌లోన్‌, బంగారంపై లోన్‌ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.   

వడ్డీ రేట్లు: బ్యాంక్‌ లోన్‌ మన ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటే పర్సనల్‌ లోన్‌పై సాధారణంగా 10నుంచి 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారనే అంశంతో పాటు రిస్క్ అసెస్‌మెంట్‌ను బట్టి బంగారంపై తీసుకునే లోన్లపై వడ్డీ రేటు 7.00 నుంచి 29 శాతం వరకు ఉంటుంది. 

రుణం మొత్తం: తీసుకున్న మొత్తాన్ని ఎంత కాలంలో చెల్లిస‍్తారనే అంశాన్ని బట‍్టి రూ .50,000 నుండి 15 లక్షల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు  30 లక్షల నుండి 40 లక్షల వరకు లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంటాయి.   

బంగారంపై రుణం: బంగారంపై ఇచ్చే రుణం లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది. ప్రస్తుత మార్కెట్‌లో దాని వ్యాల్యూ ఎంత ఉంది. మీరు ఎంత లోన్‌ కావాలనుకుంటున్నారు? మీకు కావాల్సిన లోన్‌ కి, మార్కెట్‌ లో బంగారంపై ఉన్న రేట్‌కి ఎంత వ్యత్యాసం ఉంది' అనే విషయాల్ని పరిగణలోకి తీసుకొని లోన్‌ వ్యాల్యూను మార్చేస్తుంటాయి. బంగారు లోన్‌ ఎల్‌టివి నిష్పత్తిపై ఆర్బీఐ 75 శాతం విధించింది.

ప్రాసెసింగ్‌ టైమ్‌ : లోన్‌ ఇచ్చే ముందు జరిగే  ప్రాసెస్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇలా జత చేసిన అనంతరం లోన్‌ ఇచ్చే సమయం 2 రోజుల నుంచి 7వరకు ఉంటుంది. లోన్‌ ప్రాసెస్‌ తొందరగా పూర్తయితే మనకు కావాల్సిన లోన్‌ తొందరగానే వస్తుంది.

 

తిరిగి చెల్లించే సమయం : తీసుకున్న లోన్‌ ను కొన్ని బ్యాంక్‌ లు లేదంటే ఆర్ధిక సంస్థలు 7 సంవత్సరాల వరకు గడువును విధిస్తాయి. అయితే  పర్సనల్‌ లోన్‌  సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.  బంగారంపై తీసుకున్న లోన్‌  తిరిగి చెల్లించే సమయం  3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని  బ్యాంక్‌లు  4 నుంచి 5 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాయి.   


 
పేలవమైన క్రెడిట్ ప్రొఫైల్: వడ్డీ రేట్లు మీ బ్యాంక్‌ లావాదేవీలు, క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి మారిపోతుంటాయి. అందుకే క్రెడిట్‌ కార్డ్‌లు తీసుకునే  సమయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ స్కోర్లు, నెలవారీ ఆదాయం, జాబ్‌  ప్రొఫైల్, కంపెనీ  ప్రొఫైల్ మొదలైనవి పర్సనల్‌ లోన్‌ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్స్ ఆధారంగా, కొన్ని సంస్థలు ఇచ్చే లోన్లపై ఎంత వడ్డీ విధించాలో నిర్ణయిస్తాయి.


 
ఏది మంచిది : కొంతలో కొంత పర్సనల్‌ లోన్‌ కంటే బంగారంపై లోన్‌ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంక్‌ లో తీసుకున్న పర్సనల్‌ లోన్‌ను విధించిన గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే ఎన‍్ని అనార్ధాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే బంగారంపై లోన్ తీసుకుంటే గడువులోపు పే చేయలేదంటే అదే బంగారాన్ని వేలం వేస్తాయి.  

ప్రాసెసింగ్ ఫీజు: బంగారంపై తీసుకునే లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు సాధారణంగా 2 శాతం వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు లోన్‌ తీసుకునే వ్యక్తులు, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్‌ లోన్‌ పై ప్రాసెసింగ్‌ ఫీజు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది.

మరిన్ని వార్తలు