Digital India: అమెరికా, చైనాను దాటేసిన భారత్!

30 Jul, 2021 20:44 IST|Sakshi

చాలా విషయాల్లో చైనాతో పోటీ పడుతున్న భారత్ ఈ సారి ఒక అడుగు ముందుకు వేసి చైనాను, అమెరికాను కూడా అధిగమించేసింది. డిజిటల్ లావాదేవీల పరంగా అమెరికా, చైనాలను భారతదేశం దాటేసింది. దీనికి సంబంధించిన డేటాను ఐటీ మంత్రి అశ్వినీ వైష్నావ్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 2020లో భారత్ 25.4 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసినట్లు వైష్ణవ్ శుక్రవారం ఒక ట్వీట్ లో పోస్ట్ చేశారు. చైనా 15.7 బిలియన్ డిజిటల్ లావాదేవీలతో పోలిస్తే ఇది 1.6 రెట్లు, అమెరికా 1.2 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే 21 రెట్లు ఎక్కువ.

పేటిఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మంత్రి వైష్ణవ్ ట్వీట్ ను చిన్న, చమత్కారమైన శీర్షికతో పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది మేలో నీతి ఆయోగ్, మాస్టర్ కార్డ్లు 'కనెక్టెడ్ కామర్స్: సమ్మిళిత డిజిటల్ భారత్ కోసం రోడ్ మ్యాప్ సృష్టించడం' పేరుతో ఒక నివేదికను విడుదల చేశాయి. భారతదేశంలో డిజిటల్ ఆర్థిక చేరికను వేగవంతం చేయడంలో సవాళ్లను ఈ నివేదిక గుర్తించింది.  దేశంలోని మొత్తం జనాభాకు డిజిటల్ సేవలను అందుబాటులో ఉంచడానికి సిఫార్సులను చేసింది. ఎన్ బీఎఫ్ సీ, బ్యాంకులకు మధ్య ఒక పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడానికి చెల్లింపు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. 

మరిన్ని వార్తలు