పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలే కీలకం

16 Jul, 2021 11:16 IST|Sakshi

ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో గడిచిన 18 నెలల్లో డిజిటల్‌ లావాదేవీలు అనూహ్యంగా పెరిగినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు ఇక ముందూ కీలక పాత్ర పోషిస్తాయని బ్యాంకర్లు పేర్కొన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాలు కూడా డిజిటల్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. కానీ, భౌతిక పరమైన సేవల అవసరం కూడా ఉంటుంది. భౌతికంగా అక్కడ శాఖల నిర్వహణ ఉండాల్సిందే’’ అని ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్‌ కత్పాలియా అభిప్రాయపడ్డారు.

గ్రామీణ భారతానికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కోటక్‌ మహీంద్రా బ్యాంకు జాయింట్‌ ఎండీ దీపక్‌గుప్తా.. రిటైల్‌ కస్టమర్లు భౌతిక, డిజిటల్‌ నమూనాలను అనుసరిస్తున్నా.. ఇతర కస్టమర్లు ఇప్పటికీ నగదు పరమైన లావాదేవీలే ఎక్కువగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి భౌతిక, డిజిటల్‌తో కూడిన ఫిజిటల్‌ నమూనా అవసరమని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో దీలీప్‌ ఆస్బే అన్నారు.    

చదవండి : నీ లుక్‌ అదిరే సెడాన్‌, మెర్సిడెస్‌ నుంచి రెండు లగ్జరీ కార్లు

మరిన్ని వార్తలు