అమెజాన్‌.. వెనక్కి తగ్గాలి

5 Mar, 2021 15:10 IST|Sakshi

ఆర్‌ఐఎల్‌-ఫ్యూచర్‌ డీల్‌కు‌ అడ్డు పడొద్దు

వెండర్లు, సప్లయర్లపై ప్రభావం: ఏఐసీపీడీ

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ గ్రూపు, రిలయన్స్‌ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డుపడకుండా, వెనక్కి తగ్గాలంటూ వర్తకుల మండలి.. ఆల్‌ ఇండియా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌(ఏఐసీపీడీ), స్వచ్చంద సంస్థ ప్రహర్‌ అమెజాన్‌ను డిమాండ్‌ చేశాయి. కంపెనీల మధ్య ప్రస్తుత వివాదం అలాగే కొనసాగితే అది ఫ్యూచర్‌ గ్రూపు వెండర్లు, సరఫరాదారులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘దేశ వ్యాప్తంగా సుమారు 6,000 మంది చిన్న విక్రేతలు, సరఫరాదారులకు ఫ్యూచర్‌ గ్రూపు నుంచి రూ.6,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. 2020 మార్చి నుంచి ఈ బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. 2020 ఆగస్ట్‌లో ఫ్యూచర్‌ గ్రూపు-రిలయన్స్‌ ఒప్పందం త్వరలోనే మా బకాయిలు వసూలవుతాయన్న ఆశలను చిగురింపజేసింది’’ అని ఏఐసీపీడీ, ప్రహర్‌ తమ లేఖలో పేర్కొన్నాయి. ఫ్యూచర్‌-రిలయన్స్‌ డీల్‌కు అడ్డుపడకుండా వెనక్కి తగ్గాలని లేదా తమ సభ్యుల బకాయిలను చెల్లించాలని అమెజాన్‌ను వర్తకుల సంఘం కోరింది. 

చదవండి:

అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

డెస్క్ టాప్‌లోనూ వాయిస్, వీడియో కాల్స్‌

మరిన్ని వార్తలు