Fabindia: దీపావళి కలెక్షన్‌ యాడ్‌పై దుమారం

18 Oct, 2021 20:52 IST|Sakshi

సాక్షి, ముంబై: పాపులర్‌ డిజైనర్ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్‌ ఇండియా వివాదంలో చిక్కుకుంది. రానున్న దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేసిన యాడ్‌పై దుమారం రేగింది. ప్రేమకు, కాంతికి చిహ్నమైన దీపావళికి పండుగకు స్వాగతం.  జష్న్-ఇ-రివాజ్ పేరుతో ఫ్యాబ్‌ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్‌, భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ అంటూ దీపావళి కలెక్షన్‌ యాడ్‌ను ట్వీట్‌ చేసింది. ఇదే ఇపుడు వివాదాస్పదమైంది. (Meghana Raj :ఇంతకంటే మంచి సమయం లేదు: మేఘన)

రాబోయే దీపావళి పండుగ గురించి చేసిన ప్రకటనలో తమ కలెక్షన్‌ను 'జష్న్-ఇ-రివాజ్' గా బ్రాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రతికూల స్పందనతో వివాదాస్పదమైంది. హిందూ పండుగల సందర్భంగా సెక్యులరిజాన్ని, ముస్లిం సిద్ధాంతాలను అనవసరంగా పెంపొందింస్తోందంటూ మండి పడ్డారు.  దీంతో బాయ్‌కాట్‌ ఫ్యాబ్‌ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. ఫలితంగా కంపెనీ తన అసలు ట్వీట్‌ను తొలగించింది.

బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విటర్‌లో  ఈ ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్‌ఒ టీవీ మోహన్ దాస్‌ పై కూడా విమర్శలు గుప్పించడం గమనార్హం. మరోవైపు ఆ యాడ్‌లో తప్పేమీ లేదు. దయచేసి వివాదం సృష్టించ వద్దు అంటూ  కొంతమంది ప్రముఖులు, ఇతర నెటిజన్లు కోరుతున్నారు. (Samantha: అంత పవర్‌ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత)

మరిన్ని వార్తలు