డీమార్ట్‌.. అదిరిపోయే లాభాలు

16 May, 2022 08:44 IST|Sakshi

డీమార్ట్‌ లాభం రూ. 427 కోట్లు 

డీమార్ట్‌ స్టోర్ల రిటైల్‌ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం స్వల్పంగా 3 శాతం బలపడి రూ. 427 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడా ది(2020–21) ఇదే కాలంలో రూ. 414 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికం గా 19 శాతం వృద్ధితో రూ. 8,786 కోట్లను అధిగమించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 8,210 కోట్లయ్యాయి.  

పూర్తి ఏడాదికి 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్‌ నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 1,492 కోట్లను అధిగమించింది. 2020 –21లో రూ. 1,099 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 30,976 కోట్లను తాకింది. కరోనా సవాళ్ల లోనూ క్యూ4లో పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హా పేర్కొన్నారు. ఒడిదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు స్వల్ప కాలానికి రికవరీ సాధించగలమన్న విశ్వాసం పెరిగినట్లు తెలియజేశారు. గతేడాది 50 అదనపు స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా వీటి సంఖ్య 284కు చేరినట్లు వెల్లడించారు.
 

చదవండి: స్టాక్‌ మార్కెట్‌లో హర్షద్‌ మెహతాని ఢీ కొట్టిన దమ్ము డీమార్ట్‌  దమానీదే

మరిన్ని వార్తలు