డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా?

9 May, 2021 17:43 IST|Sakshi

సాక్షి, ముంబై: డీమార్ట్ సూపర్‌‌‌‌మార్కెట్ చెయిన్‌‌ అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్ లాభాలతో అదరగొట్టింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది(2020) ఇదే కాలంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్‌మార్ట్‌ లిమిటెడ్‌కు చెందిన డీ-మార్ట్‌కు గత త్రైమాసికానికిగాను రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255. 93 కోట్ల ఆదాయంతో పోలిస్తే 18.47 శాతం అధికమైంది. వార్షికంగా మార్జిన్ ఆధాయం 8.3 శాతం పెరిగి రూ.613 కోట్లకు చేరుకున్నాయి. 

చదవండి:

వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు