గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!

16 Feb, 2022 20:29 IST|Sakshi

కరోనా మహమ్మరి తర్వాత దేశంలో దేశంలో ఆన్​లైన్ పేమెంట్స్ విలువ భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్​లైన్ పేమెంట్​ యాప్స్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. గూగుల్ పే వాడుతున్న యూజర్లకు ఆన్​లైన్ పేమెంట్​ యాప్ శుభవార్త చెప్పింది. గూగుల్ పే యాప్ ఉపయోగించే యూజర్లకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, దీని కోసం మీరు మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రూ.లక్ష వరకు లోన్ పొందడానికి అర్హులు. 

గూగుల్ పే‌ ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ పర్సనల్ లోన్ ఆఫ‌ర్‌ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అర్హత కలిగిన వినియోగదారులకు కేవలం నిమిషాల వ్యవదిలోనే డీఎమ్ఐ ఫైనాన్స్ అనే కంపెనీ రూ.1 లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు అందజేయనున్నట్లు పేర్కొంది. అయితే, తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో(3 ఏళ్ల లోపు) తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరికీ లోన్ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న యూజర్లకు రుణం లభించే అవకాశం ఉంటుంది.

"లక్షలాది మంది గూగుల్ పే వినియోగదారులకు పారదర్శకంగా, త్వరితగతిన రుణాలు అందించేందుకు మా బృందాలు పనిచేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి చేరుకోవడానికి కృషి చేస్తామని" డీఎమ్ఐ ఫైనాన్స్ సహ వ్యవస్థాపకుడు & జాయింట్ ఎండి శివశిష్ ఛటర్జీ అన్నారు. 

(చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఏడాది పాటు ఉచితంగా ఓటీటీ సేవలు..!)

మరిన్ని వార్తలు