ఫోర్బ్స్ బిలియనీర్‌ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్‌ మహీంద్రకి ఏమవుతారు?

7 Apr, 2023 16:09 IST|Sakshi

ఆసియా లేటెస్ట్‌ బిలియనీర్‌ ఎవరంటే రిలయన్స్‌ ముఖేశ్‌ అంబానీ అని ఠక్కున చెప్పేస్తాం. ఫోర్బ్స్ తన 2023 ప్రకారం 99 ఏళ్ల వయసులో బిలియనీర్ అయిన కేషుబ్ మహీంద్రాను గురించి తెలుసా? రూ. 9వేల కోట్లకు పైగా నికర విలువతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచిన కేషుబ్‌ మహీంద్రా తెలుసుకుందాం.

ఫోర్బ్స్ తన 2023 సంపన్నుల జాబితాలో భారతదేశంలో అత్యంత ధనవంతుడు ము్ఖేశ్‌ అంబానీ నిలిచారు. ఈ జాబితాలో భారత్‌ కొత్తగా 16 మంది బిలియనీర్‌లు చేరగా అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. అయితే 99 ఏళ్ల కేశబ్ మహీంద్రా భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా నిలిచారు.  (సర్కార్‌  కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్‌ సింగ్‌?)


 
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ కేషుబ్ మహీంద్రా. దిగ్గజ పారిశ్రామికవేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రకు మేనమామ. కేశబ్ మహీంద్రా 5 దశాబ్దాల పాటు మహీంద్ర గ్రూప్‌నకు నాయకత్వం వహించి కంపెనీనీ విజయతీరాలకు చేర్చారు. మహీంద్ర  గ్రూపు ప్రస్థానంలో కీలక ప్రాత పోషించిన ఆయన   2012 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. మహీంద్రా  అండ్‌ మహీంద్రాను  1945లో కేషుబ్ తండ్రి జేసీ మహీంద్రా స్థాపించారు. (IPL 2023: షారుక్ రైట్‌ హ్యాండ్‌, కేకేఆర్‌ సీఈవో గురించి ఇంట్రస్టింగ్‌ విషయాలు)

1923, అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించిన కేషుబ్ మహీంద్రా ఈ ఏడాది చివర్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వార్టన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ చేసి అనంతరం, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కేషుబ్ తన తండ్రికి చెందిన కంపెనీలో 1947లో చేరారు. 1963లో కంపెనీకి ఛైర్మన్ అయ్యారు.  మంచి కార్పొరేట్ గవర్నెన్స్, నైతికతకు ప్రసిద్ధి చెందిన కేషుబ్‌ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక కమిటీలలో ఆయన ప్రాతినిధ్యం ఉంది. 2007లో ఎర్నెస్ట్ అండ్‌ యంగ్  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఫిలాంత్రపీలో కూడా కేషుబ్‌ అగ్రగణ్యుడే. అసోచామ్ అపెక్స్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు కూడా. 1987లో, ఫ్రెంచ్ ప్రభుత్వ చెవాలియర్ డి ఎల్'ఆర్డ్రే నేషనల్ డి లా లెజియన్ డి'హోన్నూర్ అవార్డును అందుకున్నారు. 2004 నుండి 2010 వరకు న్యూ ఢిల్లీలోని వాణిజ్యం  పరిశ్రమల ప్రధాన మంత్రి మండలిలో సభ్యుడుగాపనిచేశారు. 

తొలుత మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో విల్లీసీప్‌లను అసెంబ్లింగ్ చేసేది. మహీంద్రా అండ్ మహీంద్రాను అసెంబ్లర్ నుండి భారీ సమ్మేళనంగా తీర్చిదిద్దడంలో కేషుబ్ పాత్ర కీలకం. ఆధ్వర్యంలోని కంపెనీ సాఫ్ట్‌వేర్ సేవలు, రియల్ ఎస్టేట్‌ తదితర రంగాల్లో విజయవంతంగా ప్రవేశించింది. ప్రస్తుతం టాప్‌ఎస్‌యూవీల అతిపెద్ద తయారీదారుగా పాపులర్‌ అయింది.మహీంద్రా థార్, మహీంద్రా  టీయూవీ 300,మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా బొలెరో నియో మొదలైన వాటితో సహా దాని పోర్ట్‌ఫోలియోలో అనేక విజయవంతమైన కార్లు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు