Gold: డిజిటల్‌ గోల్డ్‌తో.. లాభాల పంట

20 Jun, 2021 14:07 IST|Sakshi

డిజిటల్‌ గోల్డ్‌తో లాభాలు 

ఇన్వెస్ట్‌ డిజిటల్‌ గోల్డ్‌ పై చేయాలని నిపుణుల అభిప్రాయం  

 

చేతిలో డబ్బులుండి ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలో చాలా మందికి తెలియదు. అలా అవగాహనలేక పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతుంటారు. అయితే అలాంటి వారు డిజిటల్‌ గోల్డ్‌ మీద ఇన్వెస్ట్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు. గోల‍్డ్‌ని మనం ఆఫ్‌ లైన్‌ అంటే షాప్‌కి వెళ్లి కొనుగోలు చేస్తాం. అదే డిజిటల్‌ గోల్డ్‌ను ఇంట్లో ఉండి ఆన్‌ లైన్‌ లో కొనుగోలు చేయోచ్చు.దానిపై ఇన్వెస్ట్‌ చేసి లాభాలొచ్చినప్పుడు అమ్ముకోవచ్చు.  

అవగాహన అవసరం 

డిజిటల్‌ గోల్డ్‌ని యాప్స్‌ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఈ గోల్డ్‌ యాప్స్‌ పనిచేస్తాయి. అయితే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే గోల్డ్‌ గురించి తెలుసుకొని కొనుగోలు చేయాలి. అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే నష్టపోవాల్సి వస్తుంది.  

కొనుగోలు/ అమ్మకం ఎలా  చేయాలి ..? 

ముందుగా మీకు తెలిసిన డిజిటల్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. అంతకంటే ముందు మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. 

మీరు గోల్డ్‌ని రూపాయల్లో కానీ గ్రాముల్లో కానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. 

ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకున్న తరువాత  మీ వ్యక్తిగత వివరాల్ని ఎంటర్‌ చేయాలి.  

పూర్తి వివరాల్ని ఎంటర్‌ చేసిన తరువాత పేమెంట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. 

 డబ్బులు చెల్లిస్తే చాలు మీరు బంగారం కొనుగోలు చేయడం పూర్తవుతుంది. మరి కొన‍్న బంగారం ఎక్కడుంటుందనే అనుమానం రావొచ్చు. బ్యాంకులు డిజిటల్‌ గోల్డ్‌ను అమ్ముతుంటుంది. అలా డిజిటల్‌ గోల్డ్‌ను అమ్మే బ్యాంకుల్లో ఉన్న లాకర్లలో మీరు కొన్న బంగారాన్ని భద్రపరుస‍్తారు.ఆ బంగారాన్ని మీకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్‌ మెంట్‌ చేసుకోవచ్చు.    
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు