పాన్ - ఆధార్ లింక్ కొత్త అప్‌డేట్ వచ్చేసింది.. డోంట్ మిస్!

15 Apr, 2023 13:57 IST|Sakshi

పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్‌లో కొత్త అప్‌డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్‌మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్‌మెంట్ ఇయర్‌ను 2024-25గా ఎంచుకోవాలి.

పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. 

ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు:

  • మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
  • హోమ్ పోజీలో క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి
  • ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి.
మరిన్ని వార్తలు