ఇండియాలో మోస్ట్‌ సెల్లింగ్‌ కార్‌ ఏదో తెలుసా?

9 Mar, 2023 16:34 IST|Sakshi

సాక్షి, ముంబై:  మారుతి సుజుకి బాలెనో ఫిబ్రవరి 2023 నెలలో ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో  టాప్‌ ప్లేస్‌ కొట్టేసింది. గత ఏడాది ఇదే కాలంలో 12,570 యూనిట్లతో పోలిస్తే  ఈ ఏడాది  ఫిబ్రవరిలో 18,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో వార్షిక ప్రాతిపదికన పాజిటివ్ వాల్యూమ్ 48 శాతం పెరిగింది.  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, ఆల్టో  మోడల్స్‌ను అధిగమించి మరి బాలెనో ఈ పాపులారిటీ సాధించింది. ఈ రెండు మోడల్స్‌ కార్లు ఒక్కొక్కటి 18,000 యూనిట్లకు పైగా సేల్‌ అయ్యాయి.

అలాగే గత నెలలో ప్రధాన ప్రత్యర్థులు  హ్యుందాయ్ i20 , టాటా ఆల్ట్రోజ్‌లను వెనక్కి నెట్టేసింది బాలెనో.  అప్‌డేటెడ్‌గా వచ్చిన బాలెనో  మోడల్ రాక గేమ్ ఛేంజర్‌గా మారిందని. ప్రస్తుతం,మారుతి సుజుకి బాలెనో  సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం నాలుగు వేరియంట్లలో,ఆరు రంగల్లో  అందుబాటులో ఉంది. ధర రూ. 6.56 లక్షలు- రూ. 9.83లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఇంజీన్‌
బాలెనోలోని 1.2-లీటర్ 4-సిలిండర్ DualJet VVT పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద గరిష్టంగా 90 PS పవర్ అవుట్‌పుట్ , 4,400 rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.  170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 37 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం , 339 లీటర్ల బూట్‌స్పేస్‌ని కలిగిఉంది.  5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో కూడి ఉంది. HUD, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆర్కామిస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎడ్జస్టబుల్‌ డ్రైవర్ సీటు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్‌ AC వెంట్స్‌, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, ఫాగ్ ల్యాంప్స్, UV కట్ గ్లాస్ వంటి ఫీచర్లు  ఈ కారు  సొంతం. 
 

మరిన్ని వార్తలు