GST On Rentals: అద్దెదారులకు షాక్‌? కొత్త జీఎస్టీ గురించి తెలుసా?

12 Aug, 2022 15:39 IST|Sakshi

వ్యాపార సంస్థకు అద్దెకిచ్చినప్పుడు మాత్రమే అద్దెపై 18 శాతం జీఎస్టీ

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద  ఇకపై అద్దెదారులకు భారీ షాక​ తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే,  పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (సంచలన నిర్ణయం: ఐకానిక్‌ బేబీ పౌడర్‌కు గుడ్‌బై)

ఎవరు జీఎస్టీ చెల్లించాలి?
అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను  చెల్లించాలి.  వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు GST లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్‌ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST ఉండదు అని స్పష్టం చేసింది.

ఇది చదవండి : Anand Mahindra: వీకెండ్‌ మూడ్‌లోకి ఆనంద్‌ మహీంద్ర, భార్య జంప్‌, మైండ్‌  బ్లోయింగ్‌ రియాక్షన్స్‌

మింట్‌ అందించిన  కథనం ప్రకారం జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 18 నుంచి దేశంలో  కొత్త జీఎస్టీ పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దె చెల్లిస్తు‍న్న దానిపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, అద్దెదారు లేదా భూస్వామి నమోదు చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జూలై 17, 2022 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెను జీఎస్టీ నుంచి మినహాయించిన సంగతి తెలిసిదే. కానీ ఈ ఏడాది  జూలై 18 నుండి, నమోదు చేసుకున్న అద్దెదారు అద్దె ఆదాయంపై 18 శాతం పన్ను చెల్లించాలి.

దీనిపై స్పందించిన క్లియర్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా సాధారణ జీతం పొందే వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లయితే, వారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు, గృహ యజమానుల, నమోదిత వ్యక్తి యజమానికి చెల్లించే అద్దెపై తప్పనిసరిగా 18 శాతం GST చెల్లించాలని స్పష్టం చేశారు.  రిజిస్టర్డ్ ఎంటిటీ, లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో వ్యాపారులకు ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉందన్నారు.

ఇదీ చదవండి  ఇన్‌స్టాలో కొత్త అవతార్‌, స్నాప్‌చాట్‌లో స్పెషల్‌ ఫీచర్లు

మరిన్ని వార్తలు