బిట్‌కాయిన్‌ వరెస్ట్‌.. ఆ క్రిప్టోకరెన్సీనే బెస్ట్‌! కారణం కూడా చెప్పేశాడు

14 Dec, 2021 13:52 IST|Sakshi

క్రిప్టోమార్కెట్‌లో అతిపెద్ద డిజిటల్‌ కరెన్సీగా బిట్‌కాయిన్‌కి పేరుంది. అలాంటిది బిట్‌కాయిన్‌ కంటే.. ఎక్కడో క్రిప్టోకరెన్సీ జాబితాలో అట్టడుగున ఉండే మీమ్‌ కాయిన్‌ డోజ్‌కాయిన్‌కు ప్రయారిటీ ఇవ్వాలంటున్నాడు ఎలన్‌ మస్క్‌.
  

బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ టైమ్‌ మ్యాగజైన్‌ వారి ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఘనత దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో టైమ్‌ ఇంటర్వ్యూలో క్రిప్టోకరెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎలన్‌ మస్క్‌. 

క్రిప్టో కరెన్సీని ప్రచారం చేసే ఎలన్‌ మస్క్‌..  బిట్‌కాయిన్‌ వరెస్ట్‌ అని, దీంతో పోలిస్తే డోజ్‌కాయిన్‌ చాలా బెస్ట్‌ అని చెప్తున్నాడు. అందుకు కారణాలేంటో కూడా వివరించాడాయన. రోజూవారీ ట్రాన్‌జాక్షన్స్‌ పరంగా చూసుకుంటే.. డోజ్‌కాయిన్‌ను బెటర్‌ క్రిప్టోకరెన్సీగా అభివర్ణించాడు.  

‘బిట్‌కాయిన్‌ ట్రాన్‌జాక్షన్‌ వాల్యూ తక్కువ. ట్రాన్‌జాక్షన్‌కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఒకానొక స్థాయిలో దాచుకోవడానికి ఇది పర్వాలేదనిపించొచ్చు. కానీ, ప్రాథమికంగా ట్రాన్‌జాక్షన్‌ కరెన్సీకి బిట్‌కాయిన్‌ ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నాడు ఎలన్‌ మస్క్‌.  డోజ్‌కాయిన్‌ను హైలెట్‌ చేయడం జోక్‌గా మీకు అనిపించొచ్చు. కానీ, ట్రాన్‌జాక్షన్స్‌ పరంగా చూసుకుంటే ఇదే బెస్ట్‌. బిట్‌కాయిన్‌ ఒకరోజులో చేసే ట్రాన్‌జాక్షన్స్‌ కంటే డోజ్‌కాయిన్‌ చేసే ట్రాన్‌జాక్షన్స్‌ ఎక్కువ. 

పైగా డోజ్‌కాయిన్‌ అనేది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బిట్‌కాయిన్‌లలాగా నిల్వ గురించి కాకుండా.. జనాల చేత ఖర్చు చేయిస్తుంది. అలా ఇది ఎకామనీకి మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎలన్‌ మస్క్‌. ఇదిలా ఉంటే క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్‌ విలువ నష్టాల్లోనే నడుస్తోంది. ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో పాటు భారత్‌లో క్రిప్టో పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నేపథ్యంలో బిట్‌కాయిన్‌ విలువ పడిపోతూ ట్రేడ్‌ అవుతోంది.

చదవండి: కనిపించని కరెన్సీ గురించి తెలుసా..!

మరిన్ని వార్తలు