ఏఏఐకు ఎయిర్‌లైన్స్‌ బకాయిలు రూ.2,636 కోట్లు

27 Dec, 2021 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: విమానాశ్రయాల నిర్వహణ సంస్థ – ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు స్పైస్‌జెట్, ఇండిగో, గోఫస్ట్, ఎయిరేషియా ఇండియా, ఎయిర్‌ ఇండియా, విస్తారా కలసి 2021 అక్టోబర్‌ చివరికి రూ.2,636 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఎయిర్‌ నేవిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్‌ తదితర రూపాల్లో ఏఏఐకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐకు అత్యధిక బకాయిలు ఎయిర్‌ ఇండియానే చెల్లించాల్సి ఉంది. 2020 జనవరి 1 నాటికి రూ.2,184 కోట్ల మేర ఎయిర్‌ ఇండియా చెల్లించాల్సి ఉంటే.. 2021 అక్టోబర్‌ చివరి నాటికి రూ.2,362 కోట్లకు పెరిగినట్టు ఏఏఐ అంతర్గత పత్రాలు తెలియజేస్తున్నాయి. ఎయిర్‌ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించడం తెలిసిందే.   

>
మరిన్ని వార్తలు