మళ్లీ ఎగిసిన పసిడి

14 Sep, 2020 18:31 IST|Sakshi

రూ . 50 వేల ఎగువనే బంగారం

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భారమయ్యాయి. డాలర్‌ బలహీనపడటంతో పసిడికి మదుపరుల నుంచి డిమాండ్‌ పెరిగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 101 రూపాయలు పెరిగి 51,420 రూపాయలు పలికింది. వెండి కిలో 247 రూపాయలు భారమై 68,175 రూపాయలకు ఎగబాకింది.

అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల పతనం కూడా పసిడికి కలిసివచ్చింది. ఇక అమెరికన్‌ కరెన్సీ డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్స్‌కు 1960.50 డాలర్లకు పెరిగింది. వడ్డీరేట్లపై బుధవారం జరిగే ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీలో వెలువడే నిర్ణయం పసిడి ధరలను ప్రభావితం చేస్తుందని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు