రూ .70,000కు చేరువైన వెండి

1 Sep, 2020 17:34 IST|Sakshi

డాలర్‌ క్షీణించడంతో పసిడి పరుగు

ముంబై : గత కొద్దిరోజులుగా దిగివచ్చిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. డాలర్‌ పతనంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1988 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 252 రూపాయలు పెరిగి 51,953 రూపాయలకు ఎగిసింది.

కిలో వెండి ఏకంగా 1797 రూపాయలు భారమై 69,115 రూపాయలకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం 418 రూపాయలకు చేరి 52,963 రూపాయలు పలికింది. కరోనా వైరస్‌ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ రికవరీకి వడ్డీరేట్ల తగ్గింపునకే ఫెడరల్‌ రిజర్వ్‌ మొగ్గుచూపడం, డాలర్‌ బలహీనపడటంతో పసిడికి డిమాండ్‌ పెరిగిందని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి : ఆల్‌టైం హై నుంచి రూ . 5000 దిగివచ్చిన బంగారం

మరిన్ని వార్తలు